Balanced diet | జవహర్‌నగర్, ఏప్రిల్ 9 : పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన జీవనం పొందవచ్చని, పిల్లల్లో పోషకాహార లోపాల్ని గుర్తించి బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని అల్వాల్ ప్రాజెక్ట్ సీడీపీవో స్వాతి సూచించారు. జవహర్‌నగర్ కార్పొరేషన్ అంబేద్కర్‌నగర్ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ జయ ఆధ్వర్యంలో పోషణ్ పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా ఇవాళ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీడీపీవో స్వాతి, సూపర్ వైజర్ ధనలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ.. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మొదటి 1000 రోజులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోతే ఊబకాయం వస్తుందని, పిల్లలను అధికంగా మొబైల్ ఫోన్లకు, టీవీలకు అలవాటు పడకుండా మైదానాల్లో ఆటలకు అలవాటు చేయాలని తెలిపారు.
సమతులాహారంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం, శారీరక శ్రమ అవసరమని పేర్కొన్నారు. పోషణ్ పఖ్వాడా ప్రాముఖ్యతను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్పర్ నాగమణి, బాలింతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
BRS | ఇది పెండ్లి పత్రిక కాదు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక..!!
MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ