Commits suicide | పండుగపూట విషాదం చోటు చేసుకుంది. మేడ్చల్ మల్కాగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న నందిని అనే విద్యార్థిని నారపల్లిలో తను ఉంటున్న హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కాగా నందిని స్వస్థలం సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామంగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Rain Alert | రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
Bhadrachalam | నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు