Gulveer Singh: 10,000 మీటర్ల పరుగులో.. గుల్వీర్ సింగ్‌కు సిల్వర్ మెడల్
Gulveer Singh: గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ క్రీడల్లో 10వేల మీటర్ల ఈవెంట్లో సిల్వర్ మెడల్ గెలిచాడు. ఆ పతకం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. గుల్వీర్ సింగ్ 27:49.78 సెకన్లలో పదివేల మీటర్ల పరుగును ఫినిష్ చేశాడు.
గ్లాస్గో: భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్( Gulveer Singh) చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ క్రీడల్లో మెన్స్ 10వేల మీటర్ల ఈవెంట్లో పతకం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ఆ ఈవెంట్లో గుల్వీర్ .. రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జాతీయ రికార్డు హోల్డర్ అయిన గుల్వీర్.. కామెన్వెల్త్ గేమ్స్‌లో ఇండియాకు అథ్లెటిక్స్‌లో రెండో సిల్వర్ మెడల్ అందించాడు. ఇదే మెగా ఈవెంట్లో మెన్స్ హై జంప్ కేటగిరీలో సర్వేశ్ కుషేర్ కూడా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. గుల్వీర్ సింగ్ 27:49.78 సెకన్లలో పదివేల మీటర్ల పరుగును ఫినిష్ చేశాడు. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా అథ్లెట్ కై రాబిన్సన్ ఉన్నాడు. 27:48.93 సెకండ్స్ టైంతో రాబిన్సన్ స్వర్ణ పతకాన్ని ఎగురేసుకుపోయాడు.
గ్లాస్గోలోని స్కాట్‌స్టోన్ స్టేడియంలో భారీ వర్షం మధ్య పదివేల మీటర్ల ఈవెంట్‌ను నిర్వహించారు. ప్రతికూల వాతావరణంలోనూ భారత అథ్లెట్ గుల్వీర్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఆరంభం నుంచి లీడింగ్‌లో ఉన్న 28 ఏళ్ల గుల్వీర్.. ఫినిషింగ్ ల్యాప్స్ సమయంలో అద్భుతంగా దూసుకెళ్లాడు. మెడల్ గెలవడం ఎప్పుడూ సంతోషాన్ని ఇస్తుందని, రేస్ బాగా జరిగిందని, వర్షం ఉన్నా.. మెడల్ గెలవడం వల్ల అవన్నీ మరిచిపోతామని, ఎండ, వాన, వేడి ఇవేమీ గుర్తుకు రావని ఆసియా చాంపియన్ గుల్వీర్ అన్నారు. అన్నీ భగవంతుడిపైనే వదిలేశానని అన్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆత్రౌలీకి చెందిన అతను ప్రస్తుతం ఆర్మీలో చేస్తున్నాడు. తన ఈవెంట్ గురించి ఫ్యామిలీకి ఇంకా చెప్పలేదన్నాడు. ఇప్పుడు తాను 5కే రన్‌పై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. అమెరికాలోని స్కాట్ సిమ్మన్స్ సమక్షంలో గుల్వీర్ శిక్షణ పొందుతున్నాడు. అయితే ఆఫ్రికన్ రన్నర్స్ ఉన్న ఈ ఈవెంట్లో చాలా చాకచక్యంగా గుల్వీర్ తన రేస్‌ను కొనసాగించాడు. 10,000 మీటర్ల పరుగులో 1986 కామన్వెల్త్ క్రీడల తర్వాత తొలిసారి పోడియంపై ఆఫ్రికా అథ్లెట్ కనిపించలేదు.
మహిళల హై జంప్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆసియా చాంపియన్ పూజా సింగ్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. 1.82 మీటర్ల ఎత్తును ఆమె క్లియర్ చేయలేకపోయింది. వర్షం వల్ల 19 ఏళ్ల పూజ సరైన రీతిలో పర్ఫార్మ్ చేయలేదు.
Gulveer Singh creates history, becoming the first Indian to win a Commonwealth Games medal in the Men’s 10,000m with a brilliant silver medal finish. 👏
Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork… pic.twitter.com/6VIXZysfBJ
— Sony Sports Network (@SonySportsNetwk) July 28, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

