Ramayana | రెహమాన్ – హాన్స్ జిమ్మర్ కాంబో క్రేజ్.. ‘రామాయణం’ మ్యూజిక్ రైట్స్ కోసం భారీ పోటీ!
బాలీవుడ్ నుంచి రాబోతున్న అంత్యంత ప్రతిష్ఠాత్మాక పౌరాణిక చిత్రం 'రామాయణం' (Ramayana) సినిమాకు సంబంధించి రోజుకో కొత్త వార్త అభిమానులను ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సంగీత హక్కుల వార్తలు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Ramayana Movie | బాలీవుడ్ నుంచి రాబోతున్న అంత్యంత ప్రతిష్ఠాత్మాక పౌరాణిక చిత్రం ‘రామాయణం’ (Ramayana) సినిమాకు సంబంధించి రోజుకో కొత్త వార్త అభిమానులను ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సంగీత హక్కుల వార్తలు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ (A.R. Rahman), హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్ (Hans Zimmer) సంయుక్తంగా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ బిగ్ కాంబో కారణంగా సినిమా మ్యూజిక్ హక్కులపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
చిత్ర నిర్మాతలు ఈ సినిమా సంగీత హక్కుల కోసం దాదాపు రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అంత భారీ ధర పలుకుతుండండంతో పలు మ్యూజిక్ సంస్థలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ రేసులో ప్రముఖ ఆడియో కంపెనీ సోని మ్యూజిక్ (Sony Music) సంస్థ సుమారు రూ. 70 కోట్ల బిడ్‌తో ముందువరుసలో నిలిచినట్లు నివేదికలు వెల్లడించాయి.
అయితే, ఈ మ్యూజిక్ హక్కుల కోసం జరిగిన పోటీలో చివరకు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘టి-సిరీస్’ (T-Series) సంస్థ ముందుకొచ్చి, రామాయణం (పార్ట్ 1 మరియు పార్ట్ 2) రెండింటికి కలిపి రూ. 75 కోట్ల భారీ అడ్వాన్స్ మొత్తంతో ఆడియో రైట్స్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ డీల్ నిజమైతే బాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డుగా ఇది నిలవనుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణాసుడిగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా దృశ్యకావ్యంలో సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు నితీష్ తీవారి దర్శకత్వం వహిస్తుండగా.. నమీత్ మల్హోత్ర రూ.4000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonakshi Sinha | సోనాక్షి సిన్హా మార్ఫింగ్ ఫొటోల వివాదం.. నిందితుడికి ఊరటనిచ్చిన ముంబై కోర్టు
Ramayana | రామాయణం బాక్సాఫీస్ డే 10.. రూ. 1200 కోట్ల క్లబ్లో చేరిన రణ్‌బీర్-యశ్ చిత్రం
Student Missing | సిర్గాపూర్ ఎస్టీ గురుకులంలో పదో తరగతి విద్యార్థిని అదృశ్యం!
Yadagirigutta | కార్తీక మాసం.. ఆదివారం సెలవు.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు!
Allu Arjun | అల్లు అర్జున్ నుంచి ‘రాకా’, ‘AA23’ అప్డేట్స్ వస్తాయా .. అభిమానుల్లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

