ITI Admissions | మేడ్చల్-శామీర్‌పేట, జూన్ 2 : ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శామీర్‌పేట ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ లలిత, మేడ్చల్ ఐటీఐ ప్రన్సిపల్ హనుమానాయక్లు కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ 2025-2026, 27 విద్యా సంవత్సరానికి శామీర్‌పేటలో ఎలక్ట్రిషియన్ ఫిట్టర్, (కోపా) కంప్యూటర్ ఆపరేటర్ ఆండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, మేడ్చల్‌లో కోపా, వెల్డర్ మెకానిక్ డిసిల్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నిషియన్, మానుఫాన్ రింగ్ (ప్రోసెస్ కంట్రోల్ఆండ్ఆటోమేషన్ టెక్నిషియన్, ఎలక్ర్టిషియన్, ఎలక్ర్టానిక్-మెకానిక్, ఫిట్టర్, టర్నర్, వర్చువల్ అనాలసిస్ ఆండ్ డిజైనర్-ఎఫ్ఈఎమ్, సీఎనేని మెకానిక్ టెక్నిషియన్, ఇండస్ర్టీయల్ రోబోటిక్స్, డికింటల్స్ మానుఫ్యాక్చరింగ్ టెక్నిషియన్, మెకానిక్ ఎలక్ర్టిక్ వెహికిల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆ కోర్సులకు మొదటి విడద ప్రవేశాలకు దరఖాస్తులను చేసుకోవాలన్నారు.
ఈ నెల 2 నుంచి 21వ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి www.iZi. telangana.gov.in వెబ్ సైట్లో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకునే ముందు దృవపత్రాల్లో పుట్టిన తేది ఎస్ఎస్సీ మెమో ప్రకారం ఉండేలా చూసుకోవాలన్నారు. సీటు కేటాయించినట్లైతే దరఖాస్తులో అందించిన మొబైల్ నంబర్‌ను ఐటీఐ కోర్సు పూర్తయ్యే వరకు మార్చకూడదని సూచించారు. మొబైల్ నంబర్లో ఏదైనా మార్పు చేస్తే అట్టి అడ్మిషన్‌ను రద్దు చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వనియోగం చేసుకోవాలని కోరారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి