మేడ్చల్, ఏప్రిల్ 1 : రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల ప్రజలు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఇప్పటికే మీ సేవలో దరఖాస్తు చేసుకుని ఉంటే సంబంధిత డాక్యుమెంట్లను దరఖాస్తు ఫారంతో జత చేసి మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదార్ పాస్బుక్, సదరం సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజు ఫొటో సమర్పించాలని కమిషనర్ నాగిరెడ్డి సూచించారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి