TGRTC Buses | మల్కాజిగిరి, జూన్ 19 : మౌలాలి ఆర్టీసీ కాలనీ నుంచి బస్సులు నడపాలని మల్కాజిగిరి ఐద్వా మండల కమిటీ కార్యదర్శి పి మంగ అన్నారు. గురువారం మౌలాలి ఆర్టీసీ కాలనీ నుంచి సికింద్రాబాద్, ఈసీఐఎల్‌కు బస్సులు నడపాలని కుషాయిగూడ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఐద్వా మహిళా నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఐద్వా కార్యదర్శి పి మంగ మాట్లాడుతూ.. మౌలాలి ఆర్టీసీ కాలనీ నుండి సికింద్రాబాద్‌కు ఈసిఐఎల్‌కు బస్సులు చాలా తక్కువగా నడుస్తున్నాయని అన్నారు. ఇక్కడ ప్రజలు సికింద్రాబాద్, ఈసీఐఎల్ పరిసర ప్రాంతంలో పని చేస్తుంటారని, స్కూల్, ఉద్యోగం, హాస్పిటల్‌కు వెళ్లే వారికి కూడా బన్ సౌకర్యం లేక పేదలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
ఆర్టీసీ అధికారులు జోక్యం చేసుకొని మౌలాలి ఆర్టీసీ కాలనీ ప్రజల కష్టాలను తీర్చాలని కోరుతున్నామని మంగ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు రాజ్యలక్ష్మి, లత, పద్మ, స్వరూప, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు