Additional collector Nagesh | మెదక్ మున్సిపాలిటీ, జూన్ 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మున్సిపాలిటీల్లో చేపట్టనున్న వంద రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలని జిల్లా ఆదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో వంద రోజుల కార్యక్రమంపై మున్సిపల్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికను నేటి నుంచి సెప్టెంబర్ 10వ తేది వరకు నిర్వహిస్తుందని, ఒక మార్పు-అభివృద్ధికి మలుపు అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు. పారిశుధ్యం, మౌళిక సదుపాయాల కల్పన, ఆర్థికవృద్ధి, తడి పొడి చెత్త వేరు చేయడం, వన మహోత్సవం, పరిసరాల పరిశభ్రతపై అవగాహన, పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
అంతకుముందు తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా మున్సిపల్ ఆవరణలో జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ మహేశ్, పట్టణ ప్రణాళిక అధికారి భూపతి, మేనేజర్ భవాని, మెప్మా టీఎంసీ సునిత, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి