Revenue Conference | శామీర్‌పేట, జూన్ 9 : ప్రజలు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్లు వెంకట నర్సింహారెడ్డి, యాదగిరిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సంయుక్త అన్నారు. ఉమ్మడి శామీర్‌పేట మండలంలోని మూడు చింతలపల్లి, శామీర్‌పేట రెవెన్యూ గ్రామాల్లో సోమవారం రెవెన్యూ సదస్సులను నిర్వహించి ప్రజలు, రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అలియాబాద్‌లో నిర్వహించిన సదస్సులో 37 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ కంటం కృష్ణారెడ్డి, మాజీ వార్డు సభ్యులు బండి రాంరెడ్డి, సంజీవరెడ్డి, మల్లేష్‌యాదవ్, వెంకటేశ్, తంటం రాము, శ్రీకర్‌రెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..