TheKeralaStory2 | బాలీవుడ్ నుంచి రాబోతున్న ‘ది కేరళ స్టోరీ 2 – గోస్ బియాండ్’ చిత్రానికి కేరళ హైకోర్టులో ఊరట లభించింది. ఈ సినిమా విడుదలపై ఫిబ్రవరి 26న విధించిన 15 రోజుల స్టేను జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి మరియు జస్టిస్ పి.వి. బాలకృష్ణన్లతో కూడిన డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సెన్సార్ బోర్డు నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న కారణంతో జస్టిస్ బెచు కురియన్ థామస్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఫిబ్రవరి 26న సినిమాను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది.
అయితే కోర్టు తీర్పును సవాల్ చేస్తూ చిత్ర నిర్మాత విపుల్ అమృత్లాల్ షా డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాడు. దీనిపై నేడు విచారణ జరిపిన కోర్టు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL) స్వభావం ఉన్న ఇలాంటి అంశాలను సింగిల్ బెంచ్ విచారించడం సరికాదని అభిప్రాయపడింది. వాక్ స్వాతంత్య్రం మరియు కళాత్మక స్వేచ్ఛను గౌరవిస్తూ, సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.