అర్వపల్లి ఆగస్టు 12 : ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరి పంటలను సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, అర్వపల్లి మండల ప్రత్యేక అధికారి జి.శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలోని పెసర పంటను పరిశీలించి మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల, ఈ సీజన్లో జొన్నలు, బొబ్బర్లు, మినుములు, ఆముదాలు, కందులు వంటి పంటలను సాగు చేసుకోవాలన్నారు. విత్తనాలు కావాల్సిన వారు వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదిస్తే సబ్సిడీపై విత్తనాలను అందించేందుకు అధికారులు సహాయ పడతారన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి పల్లపు ఝాన్సీ, ఏఈఓ నేరెళ్ల సత్యం, పంచాయతీ కార్యదర్శి నవీన్ రెడ్డి, సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్, రైతులు దావుల గోపాల్, సాయిని ఉప్పలయ్య, దావుల నవీన్, బోయపల్లి వీర సోములు, లొడంగి నాగరాజు పాల్గొన్నారు.