Gold Theft | కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 23: అతను ఎప్పటిలాగే ఇంటికి తాళం వేసి ఆఫీస్‌కు వెళ్లాడు. అయితే ఆఫీస్ ముగించుకొని తిరిగి వచ్చేలోపే ఇంట్లో ఉన్న 21 తులాల బంగారం చోరీకి గురైంది. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల గాయత్రి నగర్ ప్రాంతంలో ప్లాట్ నంబర్ 401లో నివాసం ఉంటున్న కేవీ రాజ్ నారాయణ ఈ నెల 21న ఉదయం ఇంటికి తాళం వేసి ఆఫీస్‌కు వెళ్లాడు.
తిరిగి రాత్రి 8:30 గంటల సమయంలో వచ్చి చూడగా ఇంటికి వేసిన తాళం విరిగిపోయి ఉంది. లోపల లాకర్‌ను గమనించగా అది ఓపెన్ చేసి ఉంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సుమారు 21 తులాల బంగారంలో దొంగతనం చేసినట్లు బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో సంఘటనలో…
దూలపల్లి ఎస్సీ కాలనీలో నివాసముండే సత్యనారాయణ ఎప్పటిలాగానే ఉదయం సమయంలో డ్యూటీకి వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో భార్య, పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లారు. పై అంతస్తులో ఉన్నవాళ్లు కిందికి వచ్చిన సమయంలో సత్యనారాయణ ఇంటి తలుపులు తీసి ఉండడం గమనించి ఫోన్ చేశారు. దీంతో భార్య ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి ఉండటంతోపాటు బీరువా కూడా తెరిచి ఉంది. అందులో ఉన్న నాలుగు గ్రాముల బంగారం , కిలో వెండి మాయమైంది. బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు
KTR | పెంబర్తి వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి