KTR | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలోని తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర పార్టీ సీనియర్ నేతలతో కలిసి యాదిరెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ యాదిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
యాదిరెడ్డి కూతురుకు మైనర్ ఆపరేషన్ ఉందని తెలుసుకున్న కేటీఆర్ చిన్న ఆపరేషన్ అని భయపడేది ఏం లేదని ధైర్యం చెప్పారు. దగ్గరుండి అమ్మాయికి ఆపరేషన్ చేయించాలని పార్టీ నేతలను కేటీఆర్ ఆదేశించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో యాదిరెడ్డి లాంటి అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా కేటీఆర్ మరోసారి స్మరించుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన యాదిరెడ్డి కుటుంబానికి గతంలో మాదిరి ఎల్లవేళలా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలోని తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించిన వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, పార్టీ సీనియర్ నేతలు
తెలంగాణ ఉద్యమ కాలంలో యాదిరెడ్డి లాంటి అమరవీరుల త్యాగాలను స్మరించుకొని… ఆయన కుటుంబానికి గతంలో… pic.twitter.com/ZnCioXwaYB
— BRS Party (@BRSparty) June 28, 2026
Road accident | ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం
Sonu Sood | అయోధ్య విరాళాల వివాదంపై స్పందించిన సోనూ సూద్.. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్!