Nalgonda | సీఎం పర్యటన వేళ ప్రోటోకాల్ వివాదం.. పత్రికా ప్రకటనల్లో మండలి చైర్మన్ గుత్తా ఫొటో లేకపోవడంపై ఆగ్రహం
Nalgonda | నల్లగొండ జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ అంశం వివాదాస్పదంగా మారింది. సీఎం పర్యటనతో పాటు హ్యామ్ రోడ్ల శంకుస్థాపన సందర్భంగా ఆర్అండ్బీ శాఖ చేసిన పత్రికా ప్రకటనల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫొటో లేకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
Nalgonda | నల్లగొండ జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ అంశం వివాదాస్పదంగా మారింది. సీఎం పర్యటనతో పాటు హ్యామ్ రోడ్ల శంకుస్థాపన సందర్భంగా ఆర్అండ్బీ శాఖ చేసిన పత్రికా ప్రకటనల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫొటో లేకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి అయినప్పటికీ అధికారిక ప్రకటనలో తన ఫొటోను చేర్చకపోవడంపై గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సీఎం పర్యటనకు సంబంధించిన ప్రొటోకాల్ జాబితాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పున్నా కైలష్ పేరు లేకపోవడం వివాదానికి దారితీసింది. పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోనూ డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. బలహీనవర్గానికి చెందిన నేతను ఉద్దేశపూర్వకంగానే అడుగడుగునా అవమానిస్తున్నారని బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం కూడా వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రి సభలో మంత్రి పదవి అంశంపై నిరసన తెలిపే అవకాశం ఉండటంతో అతన్ని ముందస్తు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

Revanth Reddy Tour
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

