Sonu Sood | అయోధ్య విరాళాల వివాదంపై స్పందించిన సోనూ సూద్.. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్!
Sonu Sood | అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారంపై ప్రముఖ నటుడు సోనూ సూద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆయన అత్యంత దురదృష్టకరమని అభివర్ణించారు.
Sonu Sood | అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారంపై ప్రముఖ నటుడు సోనూ సూద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆయన అత్యంత దురదృష్టకరమని అభివర్ణించారు. దుర్గాపూర్ (ఛత్తీస్‌గఢ్) పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో, తమ రక్తాన్ని కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని దేవుడికి విరాళంగా ఇస్తారని అన్నారు. అలాంటి పవిత్రమైన సొమ్ము విషయంలో ఇలాంటి అక్రమాలు జరగడం నిజంగా బాధాకరమని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, విరాళాలను పక్కదారి పట్టించిన వారి ఆస్తులను తక్షణమే జప్తు చేసి, వాటిని ధర్మకార్యాలకు, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చేయాలని సోనూ సూద్ డిమాండ్ చేశారు.
ఈ విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాలలో దాదాపు రూ. 7.5 కోట్ల నుండి రూ. 27 కోట్ల వరకు అవినీతి జరిగిందని సమాజవాది పార్టీ మాజీ ఎమ్మెల్యే పవన్ పాండే ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ఈ కేసులో అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, తిన్ను యాదవ్, మనీష్ యాదవ్‌లపై కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

