Youth Arrest | మొయినాబాద్, జూలై 10: విద్యార్థులకు గంజాయి అమ్మడానికి ఇంజనీరింగ్ కళాశాల ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బంగాలీగూడ గ్రామానికి చెందిన సున్నం మధు, ప్రస్తుతం బండ్లగూడ జాగిర్ లో నివాసముంటున్న చేవెళ్ల మండల పరిధిలోని దామరగిద్ద గ్రామానికి చెందిన కొత్త మల్లె వెంకటేష్‌లు ఇద్దరు కలిసి గంజాయి విక్రయిస్తుంటారు.
అయితే ఇద్దరూ గురువారం మొయినాబాద్ మండల పరిధిలోని జీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాల మందు అనుమానాస్పదంగా తిరుగుతూ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నారు. పోలీసులకు వచ్చిన నమ్మదగిన సమాచారం వరకు పోలీసులు జేబీఐటి ప్రాంతానికి చేరుకుని.. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో యువకులు గంజాయి అమ్ముతున్నట్టుగా చెప్పారు.
విద్యార్థుల వద్ద కిలో 75 గ్రాముల గంజాయి లభించింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇద్దరిపై మీద కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
Peddapalli | అంతర్గాంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
Dasari Manohar Reddy | మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
Huzurabad | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 11 మంది అరెస్ట్