Future City victim | స్టే ఉంది.. ఈ భూముల్లోకి రావొద్దని కొట్లాడుతున్నం.. ఫ్యూచర్ సిటీ బాధిత రైతు
Future City Victim | కోర్టు స్టే ఉన్నా కూడా అవేమీ లెక్కచేయకుండా అధికారులు తమ భూముల్లోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారని బాధిత రైతుల ఆవేదన వ్యక్తం చేస్తుండటం.. ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ సర్కార్ పేదల భూములు ఎలా లాక్కుంటుందో మరోసారి చెప్పకనే చెబుతోంది.
Future City Victim | రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో లక్షలు పెట్టుబడి పెట్టి భూములు సాగు చేసుకుని రైతులు వేసిన విత్తనాలను అధికారులు జేసీబీలతో తొలగిస్తున్నారు. మరోవైపు మొలకలు వచ్చిన మొక్కజొన్నపంటను చూస్తూ కూడా పట్టించుకోకుండా జేసీబీలతో నేలమట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు.
అధికారుల దౌర్జన్యంపై బాధిత రైతు కొడుకు మాట్లాడుతూ.. ఈ భూములపై స్టే ఉంది.. రైతులు, రైతుకూలీలంతా ఈ భూముల్లోకి రావొద్దని కొట్లాడుతున్నం. అయినా కానీ వినకుండా 30-40 మంది పోలీసులు నా గళ్లా పట్టుకొని.. మా అమ్మానాన్నను, బాబాయి, చిన్నమ్మలను కింద పడేసి పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. టీజీఐఐసీ అధికారి అయితే మీరు ఎవర్రా.. ఈ భూమి మీది కాదురా అంటున్నడు. 90 ఏండ్ల నుంచి మా తాత, నాయినా, అమ్మ కష్టపడి సంపాదించిర్రు. వాడు 20-30 వేల జీతం తీసుకుంటడు. వాళ్లకు భూమి గురించి తెలియదు. భూమి ఎట్లుంటదో తెలియదు. వాడు మాట్లాడే పద్దతి అట్ల కాదు.. ఆ అధికారి ఉద్యోగం తక్షణమే తీసేయాలని కోరుకుంటున్నానని విజ్ఞప్తి చేశాడు.
కోర్టు స్టే ఉన్నా కూడా అవేమీ లెక్కచేయకుండా అధికారులు తమ భూముల్లోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారని బాధిత రైతుల ఆవేదన వ్యక్తం చేస్తుండటం.. ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ సర్కార్ పేదల భూములు ఎలా లాక్కుంటుందో మరోసారి చెప్పకనే చెబుతోంది.
ఫ్యూచర్ సిటీలో పేదల భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో లక్షలు ఖర్చు చేసి రైతు వేసిన విత్తనాలను జేసీబీలతో తొలగిస్తున్న అధికారులు
పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం
కోర్టు స్టే ఉన్నా కూడా అధికారులు తమ… pic.twitter.com/NyOe7tlFws
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2026
Read Also :
SS Rajamouli | ఇంకా 80 రోజుల షూటింగే బాకీ.. ‘వారణాసి’పై రాజమౌళి అప్డేట్!
‘వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి’
YS Jagan | ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన..కూటమి పాలనపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

