కేశంపేట : యూరియా లారీ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన ఘటన కేశంపేట మండలంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం యూరియా లోడ్‌తో షాద్ నగర్ నుంచి కొత్తపేట వైపు వస్తున్న లారీ అల్వాల – తులవానిగడ్డ గ్రామాల శివారులో గల మూలమలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని108 సహాయంతో షాద్‌నగర్ కమ్యూనిటీ దావఖానాకు తరలించారు. గాయపడిన డ్రైవర్ హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన షేక్ ఆయుబ్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Dhoni: గైక్వాడ్‌కు గాయం.. చెన్నై జట్టు కెప్టెన్‌గా మళ్లీ ధోనీ !
HCU Issue | సినిమా వాళ్లకు రాజకీయాలెందుకు.. ఓ ప్రొడ్యూసర్‌కు ముఖ్యనేత ఫోన్.. ఎడాపెడా వాయింపు