Rajeev Kanakala | నటుడు, యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల ఈ మధ్య ఇండస్ట్రీలో అంత యాక్టివ్గా కనిపించడం లేదు. అడపాదడపా సినిమాలలో లేదంటే వెబ్ సిరీస్లలో కనిపించి సందడి చేస్తున్నాడు. రీసెంట్గా ఆయన హోమ్ టౌన్ అనే వెబ్ సిరీస్ చేశాడు. దీనికి సంబంధించి పలు ప్రమోషన్ కార్యక్రమాలలో యాక్టివ్గా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే జబర్ధస్త్ వర్ష కిస్సిక్ షో.. కిసిక్ టాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇందులో తన వ్యక్తి గత విషయాల గురించి మాట్లాడారు. మిమ్మల్ని సార్ అని పిలవాలా? లేదంటే బావా అని పిలవాలా? అని వర్ష సిగ్గుపడుతూ అడగడంతో.. ‘ఇదేదో బావుందే.. నాకు అన్నీ ఇష్టమే’ అంటూ రాజీవ్ కనకాల తెగ మెలికలు తిరిగిపోయాడు.
సుమ గారితో విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి,నిజమేనా అని ప్రశ్నించగా, దానికి రాజీవ్ సమాధానం చెబుతూ మేము ఎందుకు విడాకులు తీసుకొని విడిపోతాము .ఈ విషయం తెలిసి మేము కూడా ఆశ్చర్యపోయాము. మా పిల్లలు వచ్చి ఎందుకు విడిపోతున్నారు అని అడగడంతో అప్పుడు మా దగ్గర ఎలాంటి సమాధానం లేదంటూ రాజీవ్ అన్నారు. సుమ గారికి మీకు గొడవ జరిగినప్పుడు ముందుగా ఎవరు మాట్లాడతారు అని వర్ష ప్రశ్నించింది. దానికి రాజీవ్ సమాధానం ఇస్తూ.. ఇద్దరిలో ఎవరం గొడవ పడ్డా కూడా ముందు నేనే మాట్లాడాలి. సుమా అంత తొందరగా మాట్లాడదు. చాలా మొండిదని తెలిపారు.
నేను ఏదైనా చిలిపి చేష్టలు చేస్తేనే సుమ కూల్ అవుతుందంటూ రాజీవ్ కనకాల అన్నారు. ఇక తన స్నేహితుడు ఎన్టీఆర్ వంట గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశాడు రాజీవ్ కనకాల. తారక్ పైనాపిల్ కర్రీ చాలా అద్భుతంగా చేస్తారు. నాకు ఆ కర్రీ అంటే చాలా ఇష్టం.ఆ కర్రీ రెసిపీని యూట్యూబ్లో పెట్టమని కూడా చెప్పాను. అప్పుడు ప్రతి ఇంట్లో కూడా అదే కర్రీ చేసుకుంటారు. అంత బాగుంటుంది ఆ కర్రీ అంటూ ఎన్టీఆర్ చేసే పైనాపిల్ కర్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు రాజీవ్ కనకాల. ఇక రాజీవ్ కొడుకు రోషన్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీలో చాలానే లిప్ లాక్లతో పాటు.. రొమాంటిక్ సీన్లు ఉండడం మనం చూశౄం. అయితే ఆ ముద్దుల సీన్లు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అని వర్ష అడగడంతో.. వాడి ప్లేస్లో నేను ఉంటే బాగుండని అనిపించింది అంటూ చిలిపిగా సమాధానం ఇచ్చాడు రాజీవ్ కనకాల. ఇటీవల విడుదలైన ప్రోమోలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది.ఫుల్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.శనివారం రాత్రి ఏడు గంటలకి పుల్ ఎపిసోడ్ రానుంది.