Lorry | టపాసుల లోడ్‌తో వెళ్తున్న లారీ కరెంట్ వైర్లు తగలడంతో దగ్ధమైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పరిధిలో చోటు చేసుకుంది. టపాసులను తీసుకెళ్తున్న లారీ పెంజెర్ల సమీపంలోకి రాగానే పైన ఉన్న కరెంట్ వైర్లు తగిలాయి. లారీలో పేలుడు పదార్థాలుండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాదం ధాటికి లారీలో ఉన్న టపాసులు పేలుతూ భారీ శబ్ధాలతో పెద్ద ఎత్తు మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. టపాకాయల శబ్ధాలతో పరిసర ప్రాంతమంతా దద్దరిల్లిపోయిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విద్యుత్ వైర్లు తగిలి టపాసుల లారీ దగ్ధం
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజెర్ల సమీపంలో ప్రమాదం
భారీగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన స్థానికులు
ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ టపాకాయల శబ్దాలతో ప్రాంతమంతా దద్దర్లిందని తెలిపిన ప్రత్యక్ష సాక్ష్యులు pic.twitter.com/RPbGIMLaWj
— Telugu Scribe (@TeluguScribe) March 21, 2026
బీఆర్ఎస్తోనే మైనారిటీల సంక్షేమం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్