KTR | ఫార్మాసిటీ రద్దు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, కోదండరెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి.. వీరందరూ చెప్పిన మాటేంది.. ఫార్మాసిటీని రద్దు చేసి ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తాం. కానీ ఇవ్వాలేం డ్రామాలాడుతున్నారు ఆ రైతులందరికీ ఇప్పుడు భూములు వెనక్కి ఏం ఇయ్యరట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం, ఎస్ఐఆర్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఫార్మాసిటీ భూములను పేదలకు తిరిగిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు గజం కాదు.. ఇంచు భూమన్నా వెనక్కి ఇచ్చిర్రా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడేం చేస్తున్నరు మొత్తం రియల్ ఎస్టేట్ దందా.. ముఖ్యమంత్రి, ఆయన బంధువులు, కాంగ్రెస్ నాయకులు, చిన్నోడు, పెద్దోడు అందరూ ఇయ్యాళ ఒకటే ఎట్లా భూములు గుంజుకోవాలనే పనిలో ఉన్నరు. 14 వేల ఎకరాలు కాదట.. ఇప్పుడు 30 వేల ఎకరాలట. ఇదివరకేమో బిల్డప్ ఇచ్చి భూములు వెనక్కి ఇస్తమని చెప్పి ఫార్మాసిటీని రద్దు చేస్తమని చెప్పి నేడు ఫ్యూచర్ సిటీ అని పొంకనాలు కొడుతున్నడు.
అమెరికాను మించిన నగరం కడుతా అంటున్నడు. ఆయన ఫ్యూచర్కే దిక్కు లేదు. రాహుల్ గాంధీకి కోపమొస్తే రేపో మాపో అడ్రస్ లేకుండా పోతడు. ప్రజలకు కోపమొస్తే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలోకి ఎత్తేస్తరో వాళ్లకే తెల్వదు. అట్లాంటిది ఈయననంట. ఫార్మాసిటీకి సంబంధించినంత వరకు మన విధానం స్పష్టంగా ఉన్నది. ఆ రోజు భూసేకరణ ఏదైతే జరిగిందో ఖచ్చితంగా ఫార్మాసిటీ కోసం మాత్రమే జరిగింది. ఇంకా ఏరకంగా కూడా.. అక్కడ నేను జూపార్క్ పెడతా, డేటా సెంటర్ పెడతా, ఇంకోటి పెడతా, రియల్ ఎస్టేట్ దందా చేస్తా. మా అల్లుడికి ఇంతిస్తా.. మా తమ్ముడికి ఇంతిస్తా.. అంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు.. చట్టం ఒప్పుకోదు. చట్టం ప్రకారం కూడా మీరు చేసేది తప్పు.. అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నా.అక్కడ పెట్టుబడి పెట్టాలని ముఖ్యమంత్రి ఎవరైతే కాళ్లు వెళ్లా పట్టుకుని తిరుగుతున్నడో, గడ్డాలు పట్టుకుంటున్నడో వాళ్లందరికి నేను చెప్తున్నా.. మీరు కనుక చట్టం చూసుకోకుండా ఇష్టానుసారంగా పోతే నష్టపోయేది మీరే.. గుర్తు పెట్టుకోండి.. చెప్తున్నానని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఫార్మాసిటీ రద్దు చేసి ఆ భూములు తిరిగి రైతులకు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు చెప్పారు
ఇప్పుడు ఏమో ఆ రైతులకు భూములు వెనక్కి ఇవ్వమని చెబుతున్నారు
ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి ఇవాళ ఫ్యూచర్ సిటీ అని పొంకనాలు కొడుతున్నారు
– కేటీఆర్ pic.twitter.com/qVNlxTQJ3t
— Telugu Scribe (@TeluguScribe) June 27, 2026