KTR | తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఢిల్లీ వేదికగా పార్లమెంట్ సాక్షిగా ఆత్మబలిదానం చేసుకున్న పెద్ద మంగళారం గ్రామానికి చెందిన సోదరుడు యాదిరెడ్డి త్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేడు కేటీఆర్ వికారాబాద్ నుండి తిరిగి వచ్చే క్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర పార్టీ సీనియర్ నేతలతో కలిసి యాదిరెడ్డి ఇంటికి వెళ్లారు. యాదిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
యాదిరెడ్డి కూతురుకు మైనర్ ఆపరేషన్ ఉందని తెలుసుకున్న కేటీఆర్ చిన్న ఆపరేషన్ అని భయపడేది ఏం లేదని ధైర్యం చెప్పారు. దగ్గరుండి అమ్మాయికి ఆపరేషన్ చేయించాలని పార్టీ నేతలను కేటీఆర్ ఆదేశించారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో యాదిరెడ్డి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం, 500 గజాల స్థలం, రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించి ఆదుకున్నాం. నేడు వారి కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యల గురించి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేయగా.. పార్టీ పరంగా పూర్తి వైద్య ఖర్చులు, బాధ్యతలను మేమే తీసుకుంటామని భరోసా ఇచ్చామన్నారు. సబితమ్మ కూడా తన వ్యక్తిగత నెంబర్ ఇచ్చి ఏ అవసరమున్నా అండగా ఉంటానని ధైర్యం చెప్పారన్నారు.
చరిత్ర ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం యాదిరెడ్డి లాంటి అమరవీరుల త్యాగాలను ఈ సమాజం, మన పార్టీ ఎప్పటికీ మరువదు. ఆ కుటుంబానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి ‘బీఆర్ఎస్’ ఎల్లవేళలా అండగా ఉంటుంది! 🙏
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఢిల్లీ వేదికగా పార్లమెంట్ సాక్షిగా ఆత్మబలిదానం చేసుకున్న పెద్ద మంగళారం గ్రామానికి చెందిన సోదరుడు యాదిరెడ్డి గారి త్యాగం వెలకట్టలేనిది. నేడు వికారాబాద్ నుండి తిరిగి వస్తూ, ఆకస్మికంగా… pic.twitter.com/CYqUrJf83k
— BRS Party (@BRSparty) June 28, 2026
Road accident | ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం
Sonu Sood | అయోధ్య విరాళాల వివాదంపై స్పందించిన సోనూ సూద్.. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్!