Patlolla Karthik Reddy | పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నేతల నిరసన.. వీడియో
Patlolla Karthik Reddy | బహదూర్‌గూడలో 650 ఎకరాల భూమిని కాంగ్రెస్ సర్కార్ బలవంతంగా స్వాధీనం చేసుకుంటుండగా అడ్డుకున్నందుకు మహిళలు, గ్రామస్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని అడ్డుకున్న బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని కూడా నందిగామ పోలీసులు అరెస్ట్ చేశారు.
Patlolla Karthik Reddy | శంషాబాద్ మండలం బహదూర్‌గూడలోని 650 ఎకరాలను ప్రభుత్వ భూములుగా చూపించి, వాటిని స్వాధీనం చేసుకునేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తున్న విషయం తెలిసిందే. కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆ భూములను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలోనే తమ భూముల కోసం శాంతియుతంగా ధర్నా చేపట్టిన శిబిరాల వద్దకు శనివారం తెల్లవారుజామున వేలాది మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. వారిని నిర్బంధించారు.
బహదూర్‌గూడలో 650 ఎకరాల భూమిని కాంగ్రెస్ సర్కార్ బలవంతంగా స్వాధీనం చేసుకుంటుండగా అడ్డుకున్నందుకు మహిళలు, గ్రామస్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని అడ్డుకున్న బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని కూడా నందిగామ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళలు, గ్రామస్తులకు పోలీస్ స్టేషన్లో ఉన్న పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ధైర్యం చెప్పారు.
అయితే పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని ఇంకా విడుదల చేయకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులు నందిగామ పీఎస్ ముందు నిరసనకు దిగారు. పట్లోళ్ల కార్తీక్‌రెడ్డితోపాటు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని ఇంకా విడుదల చేయని నందిగామ పోలీసులు
దీంతో నందిగామ పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు
శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు రైతులు, గ్రామస్తులను అరెస్ట్… https://t.co/VC94dajo2s pic.twitter.com/8jPu7FSI7K
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026
Read Also :
Skyroot Aerospace: కక్ష్యలోకి ప్రైవేటు రాకెట్ పంపిన మూడో దేశం మనదే: స్కైరూట్ ఏరోస్పేస్
Yuva Sangrama Sadassu | ఎండ్రిన్ తాగాల్సింది మేం కాదు.. నువ్వు.. సీఎం రేవంత్ రెడ్డిపై నిరుద్యోగ యువతి ఫైర్
‘విద్యార్థులు సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలి’
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

