Yuva Sangrama Sadassu | కాంగ్రెస్ ఇచ్చిన నిరుద్యోగ డిక్లరేషన్ ఎక్కడికిపోయిందని నిరుద్యోగ యువతి ఆస్మా ప్రశ్నించింది. కాంగ్రెస్ ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ పేరిట మోసం చేశారని మండిపడింది.
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సులో నిరుద్యోగులు తమ ఆవేదన వెల్లగక్కారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతి ఆస్మా మాట్లాడుతూ.. రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు ఊరుకోమని స్పష్టం చేసింది. సరూర్‌నగర్‌లో నిరుద్యోగ జాతర నడుస్తోందని తెలిపింది. అశోక్‌నగర్‌లో నిరుద్యోగులను మభ్యపెట్టిన రాహుల్ గాంధీ ఇక్కడికి మరోసారి రావాలని డిమాండ్ చేశారు.
విద్యాశాఖ మంత్రిగా ఉండి సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను మోసం చేశారని ఆస్మా మండిపడింది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుని తప్పు చేశామని పశ్చాత్పాపడింది. అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లను ప్రభుత్వం వెలువరించాలని డిమాండ్ చేసింది. ఎండ్రిన్ తాగాలని రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలపైనా ఆస్మా మండిపడింది. ఎండ్రిన్ డబ్బులు ఎక్కడైనా దొరుకుతున్నాయా అని ఆమె ప్రశ్నించింది. ఎండ్రిన్ తాగాల్సింది మేం కాదు.. నువ్వు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎండ్రిన్ డబ్బాలు ఎలాగైనా దొరకపట్టి తీసుకొస్తాం.. అప్పుుడు చెరో డబ్బా తాగుదామని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఊరూరూ తిరిగి, అమ్మలక్కల కాళ్లు పట్టుకుని నిన్ను గెలిపించిన పాపానికి.. ముందు రేవంత్ రెడ్డినే ఎండ్రిన్ తాగాలని పేర్కొంది. తర్వాత రాహుల్ గాంధీ, ఆ తర్వాత ప్రియాంక గాంధీ కంపల్సరీ తాగాలని డిమాండ్ చేసింది.
ఎండ్రిన్ తాగాల్సింది మేము కాదు
మమ్మల్ని మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎండ్రిన్ తాగాలి
– నిరుద్యోగ యువతి https://t.co/Q17oNLg37z pic.twitter.com/wK2TxjAahw
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026
రెండేళ్లలో ప్రభుత్వం పోలీసు నోటిఫికేషన్ విడుదల చేసిందా అని మరో నిరుద్యోగ నేత ప్రశ్నించారు. పోలీసు నిరుద్యోగ అభ్యర్థులను రేవంత్ రెడ్డి గోసపెడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వానికి గోరీ కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. 20 వేల ఉద్యోగాల ఖాళీలు ఉంటే 5వేలే భర్తీ చేస్తామని అంటున్నాడని మండిపడ్డారు.
ఉన్న స్కూళ్లు మంచిగా ఉంచురా అంటే ఇంటర్నేషనల్ స్కూళ్లు అంట
నీకు ఇంగ్లీష్ రాదు కానీ జర్మన్ భాష నేర్చుకో అంట
నువ్వు ముందు హిందీ, ఇంగ్లీష్, తెలుగు సక్కగా నేర్చుకో
– నిరుద్యోగ యువతి https://t.co/q4vnwbHbH1 pic.twitter.com/iHJ3jBuitS
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026