ఆదివారం 17 జనవరి 2021
Rangareddy - Nov 23, 2020 , 07:38:03

బూత్‌ కమిటీలే కీలకం: అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి

బూత్‌ కమిటీలే కీలకం: అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి

మన్సూరాబాద్‌ : ప్రచారంలో బూత్‌ కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని, ఇంటింటా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని మన్సూరాబాద్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ ఎన్నికల పర్యవేక్షకుడు, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.  శైలజాపురికాలనీలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో మన్సూరాబాద్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ బూత్‌ కమిటీల సమావేశాన్ని నిర్వహించారు. దీనిని మన్సూరాబాద్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. అభ్యర్థి గెలుపు కోసం అమలు చేయాల్సిన వ్యూహాలతో పాటు సలహాలు, సూచనలు చేశారు. ప్రచార పర్వాన్ని మరింతగా ఉధృతం చేసి, ఆరేండ్లుగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్‌, బీజేపీ అబద్ధపు వాగ్ధానాలు, విమర్శలపై ప్రజలకు వివరించి, ఆ పార్టీలను ఎండగట్టాలన్నారు. ప్రతి నిమిషం ఎంతో విలువైనదని, ప్రచారానికి సమయం ఎక్కువగా లేదని, కార్యకర్తలు నాయకులు అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. జీహెచ్‌ఎంసీలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి అందిస్తున్న మంచినీటి విషయంతో పాటు 24గంటల కరెంటును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 

అభివృద్ధిని ప్రజల కండ్లకు కట్టాలి.. 

మన్సూరాబాద్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు బాధ్యతను కార్యకర్తలు తమ భుజస్కంధాలపై వేసుకోవాలని అభ్యర్థి కొప్పుల విఠల్‌రెడ్డి అన్నారు. సమైక్య రా ష్ట్రంలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్‌ చేసిన అభివృద్ధిని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన త ర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్‌ చేసిన అభివృద్ధిని ప్రజల కండ్లకు కట్టినట్లు వివరించాలని మ న్సూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల విఠల్‌రెడ్డి సూ చించారు. గత ప్రభుత్వాల హయంలో దోచుకోవడం.. దాచుకోవడం తప్పా, ప్రజలకు చేసిందేమి లేదనిన్నారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడులు సృష్టించాలని చూస్తున్న బీజేపీ పార్టీ ఎత్తుగడలు ప్రజల ముందు పారవని ఆయన అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా విజయం తమదేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్మన్‌ఘాట్‌ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం కమిటీ చైర్మన్‌ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌, డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, నాయకులు జక్కిడి మల్లారెడ్డి, చుక్కమెట్టు శ్రీకాంత్‌రెడ్డి, పోచబోయిన జగదీశ్‌యాదవ్‌, జక్కిడి రఘువీర్‌రెడ్డి, మన్నె రమణారెడ్డి, అత్తాపురం రాంచంద్రారెడ్డి, రుద్ర యాదగిరి, టీ. మోహన్‌రెడ్డి, గుంటకండ్ల రాజశేఖర్‌ రెడ్డి, కే ఆనంద్‌యాదవ్‌, బాల్‌రాజ్‌ గౌడ్‌, సిద్ధగోని జగదీష్‌గౌడ్‌, కే. వెంకటాచార్యులు, నర్రి వెంకన్న కురుమ, విజయ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.