కొన్ని సముద్ర జీవులు చాలా డేంజర్. ఆత్మరక్షణ కోసం అవి విషాన్ని తయారు చేసుకొని.. వాటికి అపాయం కలుగుతుంది అని అనుకున్నప్పుడు వెంటనే ఆ విషాన్ని ఎదుటి జీవులపై ప్రయోగించి తమను తాము కాపాడుకుంటాయి. సాధారణంగా భూమ్మీద అయితే పాములు, తేళ్లు.. అలాగే విషంతో మనుషులకు హాని చేస్తాయి.
సేమ్.. అలాగే సముద్రంలో ఉండే కొన్ని జీవులు కూడా చాలా డేంజర్ గా ఉంటాయి. అవి మనుషులను చంపేయగలవు. మనుషులను క్షణాల్లో చంపే ఎన్నో జీవరాశులు సముద్రాల్లో నివసిస్తుంటాయి. కానీ.. అవి భూమ్మీదకు రావు కాబట్టి.. సముద్రంలో ఎక్కడో లోపల ఉంటాయి కాబట్టి.. వాటి వల్ల మనుషులకు అంతగా అపాయం ఉండదు.
తాజాగా అలాంటి విష జాతికి చెందిన ఓ చేప.. యూకేలో వెలుగు చూసింది. దాని పేరు లయన్ ఫిష్(Lion Fish). ఈ చేప విషంతో మనిషికి వెంటనే పెరాలిసిస్ వచ్చేలా చేయగలదు.. క్షణాల్లో మనిషిని చంపేయగలదు. ఇది కేవలం ఆరు ఇంచుల పొడవు మాత్రమే ఉంటుంది. ఈ డేంజరస్ ఫిష్ ను చెసిల్ బీచ్ లో ఫిషింగ్ చేస్తూ ఓ వ్యక్తి పట్టాడు.
లయన్ ఫిష్.. లేదా టెరోయిస్ అనే పేరుతో పిలవబడే ఈ చేప ఇండో పసిఫిక్ రీజియన్ కు చెందినది. ఇదే చేపకు పలు రకాల పేర్లు ఉన్నాయి. జెబ్రా ఫిష్, ఫైర్ ఫిష్, టర్కీ ఫిష్, బటర్ ఫ్లై కాడ్ లాంటి పేర్లతో పిలుస్తారు.
ఈ చేపకు ఉండే బ్లాక్ బ్యాండ్స్, పెక్టోరల్ ఫిన్స్, స్పైకీ ఫిన్ రేస్ ను మనుషులు ముట్టుకుంటే చాలు వెంటనే పెరాలిసిస్ రావడం, తీవ్రంగా నొప్పి పుట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది.
ఈ చేపను పట్టుకున్న వ్యక్తి.. ఇది అరుదైన జాతికి చెందిన చేప అని గుర్తించి.. దాన్ని వెంటనే అక్కడి బయాలజిస్టులకు సమాచారం అందించాడు. అదృష్టవశాత్తు ఆ చేప అతడిపై దాడి చేయకుండా అడ్డుకోగలిగాడు. యూకేలో ఈ జాతికి చెందిన చేపను పట్టుకోవడం ఇదే మొదటి సారి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్‌లో వానరం దర్జా : ఫుడ్ లాగించి..జ్యూస్ తాగుతూ ఎంజాయ్!
World’s Oldest Living Man : ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఈయన.. వయసు ఎంతో తెలుసా?
Shocking Video : బాలిక ఒడిలో నిద్రపోతున్న పైథాన్
Photo of the Day : సీతాకోకచిలుకలతో గొరిల్లా ఆట.. ఈ ఫోటో చూస్తే వావ్ అనాల్సిందే
వైరల్ పిక్స్ : రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకున్నాడు!