World’s Oldest Living Man : ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఈయన.. వయసు ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు | ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఆయన వయసు ఎంతో తెలుసా? ఆయన పేరు సాటర్నినో
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఆయన వయసు ఎంతో తెలుసా? ఆయన పేరు సాటర్నినో. స్పెయిన్ లో 1909 వ సంవత్సరంలో జన్మించాడు. 11 ఫిబ్రవరి తారీఖున జన్మించినా.. ఆయన బర్త్ డే మాత్రం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8న చేసుకుంటాడు. ప్రస్తుతం ఆయన వయసు 112 సంవత్సరాలు. ప్రపంచం మొత్తం మీద ఇంత వయసుతో బతికి ఉన్న వాళ్లెవరూ లేరు. దీంతో సాటర్నినోను ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా పేర్కొంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు ఎక్కించారు.

సాటర్నినోకు ఏడుగురు కూతుళ్లు, ఒక్క కొడుకు ఉండేవాడు. తన కొడుకు.. చిన్నతనంలోనే చనిపోయాడు. ప్రస్తుతం 112 ఏళ్ల ఈ తాత బాగోగులను తన కూతురు, అల్లుడు చూసుకుంటున్నారు. ప్రస్తుతం తన ఫ్యామిలీలో 14 మంది మనవళ్లు, మనవరాళ్లు, 22 మంది మునిమనవళ్లు, ముని మనవరాళ్లు ఉన్నారు.
ఈసంవత్సరం ఫిబ్రవరి 8న తన 112 వ పుట్టిన రోజును తన ఫ్యామిలీ మధ్య అంగరంగ వైభవంగా జరుపుకున్నాడు ఈ తాత. అయితే.. గత 8 నెలల నుంచి కోవిడ్ వల్ల.. ఎటూ బయటికి వెళ్లలేక.. తన కుటుంబ సభ్యులను కలుసుకోలేకపోతున్నాడట ఈ తాత.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా సాటర్నినో రికార్డు క్రియేట్ చేయగా.. జపాన్ కు చెందిన కనె తనక.. 118 ఏళ్ల వయసుతో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇంతకీ.. సాటర్నినో.. ఇంతకాలం ఆరోగ్యంగా పది కాలాల పాటు బతికి ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ప్రశాంతమైన జీవితం. తన పనేదో తాను చేసుకొని.. ప్రశాంతంగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఉండటమే తన నూరేళ్ల ఆయుష్షుకు ప్రధాన కారణం అని సాటర్నినో చెప్పుకొచ్చాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Shocking Video : బాలిక ఒడిలో నిద్రపోతున్న పైథాన్
Photo of the Day : సీతాకోకచిలుకలతో గొరిల్లా ఆట.. ఈ ఫోటో చూస్తే వావ్ అనాల్సిందే
వైరల్ పిక్స్ : రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకున్నాడు!
Hangover | గుడ్డు తింటే హ్యాంగోవర్ తగ్గిపోతుందా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

