Nagaraju Gurrala | తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు అత్యంత దురదృష్టకరంగా మారాయని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల తీవ్రంగా ఖండించారు. ఇటీవల కొత్తగా గెలిచిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాష ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చగా మారిందన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉండి దిగజారిన స్థాయిలో మాట్లాడటం అత్యంత బాధాకరమని, రాజకీయ హుందాతనానికి పూర్తిగా విరుద్ధమని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా అంటూ బెదిరింపులకు దిగడం రాజకీయ అహంకారానికి పరాకాష్టగా అభివర్ణించారు.
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా కష్టపడి జీవిస్తున్న ఎన్ఆర్ఐలను అవమానించేలా మాట్లాడటం తీవ్రంగా ఖండనీయమని నాగరాజు గుర్రాల పేర్కొన్నారు. ఉపాధి కోసం స్వదేశాన్ని వదిలి విదేశాల్లో కష్టపడి పనిచేస్తున్న లక్షలాది మంది తెలంగాణ బిడ్డల శ్రమను చిన్నచూపు చూడటం సమాజానికి తగదని అన్నారు.
శ్రమకు గౌరవం ఇవ్వడమే నిజమైన సంస్కృతి అని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గౌరవాన్ని, స్వాభిమానాన్ని కాపాడేందుకు ఎప్పటికీ ముందుంటుందని, ప్రజలే తగిన సమయంలో తగిన సమాధానం ఇస్తారని నాగరాజు గుర్రాల ధీమా వ్యక్తం చేశారు.
Jagadish Reddy | రేవంత్‌రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు : జగదీశ్‌రెడ్డి
Bus overturns | మహబూబ్‌నగర్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు : వీడియో
Hrithik Roshan | పెళ్లి వేడుకలో కుమారులతో కలిసి స్టెప్పులేసిన హృతిక్ రోషన్… వీడియో వైరల్