Nagaraju Gurrala | ఈ నెల 20వ తేదీన జగిత్యాల గడ్డపై జరగబోయే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ‘జగిత్యాల జన గర్జన’ను ఘన విజయంగా మార్చే బాధ్యత మన అందరిదని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ (సౌత్ ఆఫ్రికా) నాగరాజు గుర్రాల అన్నారు. తెలంగాణ గర్వకారణమైన నాయకుడు కేసీఆర్ సమక్షంలో ఈ సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించబడనుంది.
ఈ సభలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తమ అనుచరులు, వేలాది మంది కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఒక కీలక ఘట్టమన్నారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశను చూపే పరిణామం. మొన్న కేటీఆర్ జగిత్యాలకు వచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ ఆశయాలకు, రామన్న ఆలోచనలకు న్యాయం జరగాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే. అప్పుడు మాత్రమే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది.
‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే నినాదంతో జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్రకు శ్రీకారం చుడుదామని పిలుపునిచ్చారు. ప్రజల ఆశలు, అభిలాషలు గెలిచే రోజు దగ్గరలోనే ఉంది. జగిత్యాల వాసిగా, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ (సౌత్ ఆఫ్రికా)గా మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరై ఈ మహాసభను విజయవంతం చేయండి. పెద్ద ఎత్తున తరలి రండి..మన శక్తిని చూపిద్దాం .. తెలంగాణ గళాన్ని గర్జింపజేద్దాం. జగిత్యాల జన గర్జనను విజయవంతం చేయండని నాగరాజు గుర్రాల పిలుపునిచ్చారు.
Mahabubabad | చెత్తను ఊడ్చి మున్సిపల్ కార్యాలయంలో పడేసిన ప్రజలు : వీడియో
రెండేళ్ల చిన్నారిని హతమార్చిన తండ్రి
Ashok Mittal | ఫెమా ఉల్లంఘన ఆరోపణలు.. ఆప్ ఎంపీ ఇల్లు, వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు