Mahesh Thanneeru | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తీరుపై, పరిపాలనా విధానంపై అమెరికా తెలంగాణ ఎన్ఆర్ఐలలో తీవ్రమైన వ్యతిరేకత, ఆగ్రహం ఉన్నాయని బీఆర్ఎస్ యూఎస్ఏ చైర్మన్ మహేష్ తన్నీరు తెలిపారు. రేవంత్ రెడ్డి, ప్రజల కోసం బాగా పని చేస్తాడని, అధికారులని, మంత్రులని, ప్రజలని, ప్రతిపక్షాన్ని సమన్వయం చేసుకుంటూ.. ప్రగతిపై కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ముందుకు వెళతాడని ఆశించాం, కానీ పరిపాలన మొత్తం నామ మాత్రంగా ఉంది. ప్రజలకు అడుగడుగునా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.
ముఖ్యమంత్రిగా ఆదర్శంగా ఉండాల్సినవాడు, వెగటు మాటలు మాట్లాడడం చాలా జుగుప్సాకరంగా ఉందన్నారు. ఇలాంటి ప్రవర్తన వలన పదవికి ఉన్న ప్రతిష్ట తగ్గడమే కాదు. ప్రజల్లో కూడా చులకన కావాల్సి వస్తుందని హెచ్చరించారు. పదవి శాశ్వతం కాదని, అడ్డమార్గంలో పదవిని కాపాడుకోవడం అసాధ్యం అని చెప్పారు. మళ్లీ గెలవడం గురించి ఆందోళన మానేసి, ఇప్పుడు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహేష్ తన్నీరు చెప్పారు. ప్రభుత్వం పని చేస్తుంటే దాంట్లో మంచి చెడులు ఎత్తి చూపడం ప్రతిపక్షాల బాధ్యత అని, దానిని బీఆర్ఎస్ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పారు.
మాతృ భూమిపై ప్రేమతో తమ వంతు పాత్ర..
సమర్థంగా పని చేస్తున్న ప్రతిపక్షాన్ని దుర్భాషలాడం పూర్తిగా ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని చెప్పారు. ప్రజలు, ఎన్ఆర్ఐలు అన్ని చాలా సునిశితంగా గమనిస్తున్నారని, సరైన సమయం లో సరైన విధంగా స్పందిస్తారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ఆందోళనకరమైన సామాజిక, ఆర్థిక
పరిస్థితులున్నాయని, ఇటువంటి సమయంలో రాష్ట్రాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్లాలని లేని పక్షంలో ప్రజలకి క్షమించరాని ద్రోహం చేసిన వారవుతారని మహేష్ తన్నీరు చెప్పారు.
ఎన్ఆర్ఐ లు ఎక్కడ ఉన్నా మాతృ భూమిపై ప్రేమతో తమ వంతు పాత్ర పోషిస్తారని, వారిని చులకన చేస్తూ మాట్లాడం ఏ విధంగా సబబో వారే చెప్పాలని అన్నారు. ఎన్ఆర్ఐలపై ఇక నుంచి ఎవరు విద్వేషపూరిత భాష మాట్లాడినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చట్టపరమైన చర్యలకు కూడా వెనకాడం అని హెచ్చరించారు. అమెరికాలో చట్ట పరమయిన చర్యలకి కూడా వెనుకాడం అని మహేష్ తన్నీరు హెచ్చరించారు.
Actor Shivaji | హీరోయిన్ల డ్రెస్సులపై కామెంట్స్.. శివాజీకి నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్
Thalapathy Vijay | ‘ఇదే నా చివరి సినిమా’.. సినిమాలకు గుడ్ బై చెప్పిన దళపతి విజయ్
Rajendran | గుండు వెనుక విషాద కథ.. అదే రాజేంద్రన్‌కు వరంగా మారిందట!