కువైట్ : కువైట్లో(Kuwait) దక్షిణ భారత రాష్ట్రాల(Southern states) ఆవిర్భావ దినోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని ‘దక్షిణ సంభ్రమాన్ని’ నిర్వహించారు. ఎంబసీ ఆడిటోరియంలో ఆంధ్ర ప్రదేశ్,కర్నాటక రాష్ట్రాలకు చెందిన వివిధ కమ్యూనిటీ సంఘాలతో సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు హాజరయ్యారు.
భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా మాట్లాడుతూ..అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎంబసీ 12 వాట్సాప్ నంబర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎంబసీ సిబ్బందిగా నటిస్తూ మోసగాళ్లు సహాయం కోసం డబ్బులు అడుగుతున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమంలో కన్నడ కూట, తుళు కూట, బిల్లవ సంఘం, తెలుగు కళా సమితి, జానపద నృత్య ప్రదర్శనలు యక్షగాన, కూచిపూడి,చెక్క భజనలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి.