బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆరోగ్యానికి హాని చేసే ప్రమాదకరమైన కూరగాయలు విక్రయిస్తున్నారా? అంటే అవుననే అంటున్నది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) జరిపిన ఒక సర్వే. బెంగళూరులో విక్రయించే కూరగాయల్లో గణనీయంగా సీసం ఉందని ఇది నిర్ధారించింది.
నగరంలో సేకరించిన కూరగాయల శాంపిల్స్‌లో 26 శాతం కూరగాయల్లో నిర్ధారిత సురక్షిత మోతాదును మించి సీసం ఉన్నట్టు తెలిసింది. దీనిపై నగరవాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం కావడంతో పాటు ఆహార భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజా శాంపిల్స్‌లో భారీగా లోహాల ఉనికికి పలు పర్యావరణ కారకాల ప్రమేయం ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు.