Thieves | నిజామాబాద్ జిల్లా : మోపాల్ మండలంలోని కులాస్పూర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు బుధవారం రాత్రి ఏకంగా తాళం వేసి ఉన్న 11 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఠా సభ్యులు రాత్రి పదిమందితో చోరీలు చేశారు.
సుమారు 5 తులాల బంగారం.. రూ. 2లక్షలకు పైగా నగదు చోరీకి గురైంది. పక్కన ఉన్న ఇళ్లకు బయటి నుంచి గడియ పెట్టి దుండగులు చోరీలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.
గ్రామస్తుల కథనం ప్రకారం.. పిల్లులు పడతామని గ్రామంలో నలుగురు ఐదుగురు తిరిగారు. వారు గ్రామంలో తిరుగుతూ ఏ ఇల్లు తాళం వేసిందో చూసుకొని మరి దోపిడీకి గురి చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ పిల్లుల కోసం వచ్చామని.. పిల్లులను పట్టుకెళ్తామని చెప్తూ అందరినీ నమ్మించి ఈ దొంగతనాలకు పాల్పడినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి గ్రామాన్ని సందర్శించారు.
Srisailam Temple | శ్రీశైలం మల్లన్న ఆలయానికి 27రోజుల్లో రూ.4.17కోట్ల ఆదాయం..!
Ramavaram : జట్టు స్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చు : జీఎం షాలెం రాజు
KTR | తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం కేటీఆర్ : ఎమ్మెల్యే కొనింటి మానిక్ రావు