Nizambad : ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44పై మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక లారీ .. అదుపుతప్పి ముందున్న కారును వెనుక నుంచి వేగంగా డీ కొట్టింది. ఆ కారు ముందున్న మరో కార్ని ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన కారు బైక్‌ను ఢీ కొట్టడంతో కామారెడ్డి జిల్లా ఉత్తునూరు గ్రామానికి చెందిన దంపతులు రోడ్డు పక్కన పడిపోయారు. వారికి కూడా చిన్నపాటి గాయాలయ్యాయి.
రెండు కార్లు, లారీ రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. యాక్సిడెంట్ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లి కార్లను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. గాయపడిన వారిని టోల్ ప్లాజా అంబులెన్స్‌లో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక కారు ముందు భాగం నుజ్జునుజ్జుకాగా.. మరొక కారు రోడ్డు పక్కనే ఉన్న నీటి గుంతలోకి దూసుకెళ్లింది.