OnePlus Nord CE 5 | మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను రూపొందించి అందించడంలో వన్ ప్లస్ ఎప్పటికప్పుడు సంచలనాలను సృష్టిస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో నార్డ్ సీఈ5 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను వన్ ప్లస్ భారత మార్కెట్లో లేటెస్ట్గా రిలీజ్ చేసింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.77 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 12జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. అదనంగా మరో 8జీబీ వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు.
ఈ ఫోన్లో క్రయో వెలాసిటీ వీసీ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్‌కు గురి కాదు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయగా, మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింట్ సిస్టమ్ లభిస్తుంది. ఈ ఫోన్‌కు గాను 4 ఆండ్రాయిడ్ అప్డేట్స్ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఇక ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ అని చెప్పవచ్చు. ఇందులో ఏకంగా 7100 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను కేవలం 1 గంటలోనే 100 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు.
8జీబీ ర్యామ్, 12జీబీ ర్యామ్, 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఈ ఫోన్లో ఉన్న కెమెరాల సహాయంతో అద్భుతమైన 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా లభిస్తుంది. 5జి సేవలను పొందవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లు కూడా ఈ ఫోన్లో లభిస్తున్నాయి.
వన్ ప్లస్ నార్డ్ సీఈ5 స్మార్ట్ ఫోన్‌ను బ్లాక్ ఇన్ఫినిటీ, మార్బుల్ మిస్ట్, నెక్సస్ బ్లూ కవర్ వేరియెంట్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.24,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999గా ఉంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.28,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు వన్ ప్లస్ ఆన్లైన్ స్టోర్‌లో, వన్ ప్లస్ స్టోర్ యాప్‌లో, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో జూలై 12వ తేదీ నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను అందిస్తున్నారు. ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.2000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని సైతం అందిస్తున్నారు.