Arunachala Kshetram darshan | బోడుప్పల్, జూలై 8: విజ్ఞాన విహార యాత్రలకు టీఎస్ఆర్టీసీ అందిస్తున్న ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ప్రజలు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ చెంగిచెర్ల డిపో మేనేజర్ కే కవిత సూచించారు. ఆర్టీసీ చెంగిచెర్ల డిపోలో మంగళవారం డిపో మేనేజర్ కే కవిత మాట్లాడుతూ… అరుణాచల పుణ్యక్షేత్ర దర్శనానికి ఈ నెల 11న సాయంత్రం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
జూలై 11 శుక్రవారం సాయంత్రం చెంగిచెర్ల నుండి ఉప్పల్ బస్టాండ్, ఉప్పల్ చౌరస్తా, నాగోల్ చౌరస్తా, ఎల్బీనగర్, అరాంఘర్ మీదుగా కానిపాకం విఘ్నేశ్వర స్వామి దర్శనం, అనంతరం వెల్లూరు గోల్డెన్ టెంపుల్ అమ్మవారి దర్శనం, అనంతరం అరుణాచల శివ దర్శనం ఉంటుందన్నారు. ఈ నెల 13 ఆదివారం సాయంత్రం అరుణాచలం నుండి బయలుదేరి సోమవారం ఉదయం తిరిగి చేరుకుంటుందని ఆమే పేర్కొన్నారు. ఈ ప్రయాణానికిగాను పెద్దలకు రూ.3900, పిల్లలకు రూ.3300 రవాణా చార్జీ ఉంటుందని తెలిపారు.
ఆర్టీసీ సంస్థ కల్పిస్తున్న ప్రత్యేక దర్శనసౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు. ఆన్లైన్ ద్వారాగాని, చెంగిచెర్ల డిపోలోగాని టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఆమె చెప్పారు. 35 మంది గ్రూపుగా ఉన్నట్లయితే మీ ఇంటి వద్దకే బస్ సౌకర్యం కల్పిస్తామన్నారు. సంస్థ కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని దైవదర్శనం చేసుకుని తరించాలని ఆమె కోరారు. వివరాలకు డిపో మేనేజర్ ఫోన్ 789308843, అసిస్టెంట్ మేనేజర్ 9063413318 నెంబర్లను సంప్రదించాలని ఆమె కోరారు.
Amberpet | రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
Trade Deal | త్వరలో అమెరికాతో భారత్తో వాణిజ్య ఒప్పందం.. కీలక సూచనలు చేసిన జీటీఆర్ఐ..
Horror | దెయ్యం వదిలిస్తామంటూ నాలుగు గంటలు చిత్రవధ.. దెబ్బలు తాళలేక మహిళ మృతి..!