వినాయక నగర్ ,ఫిబ్రవరి :16 ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువయ్యాడని బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్(MP Laxman )ఎద్దేవా చేశారు. ఆదివారం నిజామాబాద్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ చిచ్చుపెట్టేందుకు చూస్తుందని అన్నారు.
తన విద్యాసంస్థలను కాపాడుకునేందుకే నరేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని విమర్శించారు. మోదీ గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గులేని తనమని ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అదిలాబాద్ ఎంపీ నగేష్ తో పాటు ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఎమ్మెల్సీ అభ్యర్థి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Chamakura Mallareddy | స్కూటర్‌పై మళ్లీ పాలు అమ్ముతూ కనిపించిన మాజీ మంత్రి మల్లారెడ్డి
Old Woman Lived With Corpses Of Family | కుటుంబ సభ్యుల శవాలతో.. రెండు రోజులు ఇంట్లో ఉన్న వృద్ధురాలు