Chamakura Mallareddy | మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే డైలాగ్ ఒక్కటే! పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. తన వేరియషన్లో మల్లారెడ్డి చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది.. డైలాగ్ వరకే కాదు.. నిజంగానే ఆయన పాలు అమ్ముకునే స్థాయి నుంచి వ్యాపారవేత్తగా, రాజకీయవేత్తగా ఎదిగారు.. అలాంటి మల్లారెడ్డి ఇప్పుడు మరోసారి స్కూటర్‌పై ఎక్కి పాలు అమ్ముతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ పాల డబ్బాలతో కనిపించిన ఓ స్కూటర్‌ను చూడగానే మల్లారెడ్డి తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. దీంతో వెంటనే వెళ్లి ఆ స్కూటర్ ఎక్కేశారు. గతంలో పాలు అమ్ముతూ కష్టపడిన రోజులను నెమరేసుకున్నారు. అనంతరం ఎంతో ఆనందంతో స్కూటర్ పై నుంచి దిగి ఆ పాల బండి ఓనర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. ఇదంతా అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీసి నెట్టింట పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
స్కూటర్ పై పాలు అమ్ముతూ సందడి చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లా – బోడుప్పల్లో స్కూటర్ పై పాలు అమ్ముతు సందడి చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆయన అక్కడ తనకు పాల డబ్బాతో కనిపించిన స్కూటర్ పై ఎక్కి కూర్చొని.. ఒకప్పుడు తాను కూడా స్కూటర్ పైనే పాల… pic.twitter.com/1oflx6oiMf
— Telugu Scribe (@TeluguScribe) February 16, 2025