పెద్ద కొడప్గల్, జూలై 03: కామారెడ్డి జిల్లా (Kamareddy) పెద్ద కొడప్గల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పెద్ద కొడప్గల్ మండలంలోని జగన్నాథ్ పల్లి సమీపంలో ఉన్న 161వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుడిని పిట్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాధితులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.