కామారెడ్డి : కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతంలోనూ కురుస్తున్న వానలకు జలాశయాల్లోకి ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. కాగా, నిజాం సాగర్ ప్రాజెక్టకు వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు13 గేట్లు ఎత్తి దిగువకు 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఇన్ ఫ్లో 85 వేలు క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 50 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405. 00 అడుగులకు గాను ప్రస్తుతం 1403.33 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.443 టీఎంసీలుగా ఉంది.