Kamareddy : కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లన్ని జలమయం అయ్యాయి. వరద ఉద్ధృతికి ఒక ఆర్టీసీ బస్సు (RTC Bus) నీటిలో చిక్కుకుపోయింది. గాంధారి నుంచి బాన్సువాడ మార్గంలో వెళ్తున్న బస్సు సర్వాపూర్ (Sarvapur) వద్ద నిలిచిపోయింది. సర్వాపూర్ వాగు అలుగు పొంగి జోరుగా ప్రవహిస్తుండడంతో వాగు దాటుతుండగా బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బస్సు ముందుకు కదలేకపోయింది.
వరదలో చిక్కుకున్న బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. వాళ్లను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రోడ్లన్ని చెరువును తలపిస్తున్నందున వాళ్లకు సర్వాపూర్లోని ఒక ప్రైవేట్ స్క్లూలో బస ఏర్పాటు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ చెక్ పోస్టును రద్దు చేసింది. 14 సరిహద్దు చెక్‌పోస్టులను, కామారెడ్డిలోని మరోక చెక్ పోస్టును సైతం రద్దు చేశారు ఆర్టీఏ అధికారులు. వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని జిల్లా విద్యాధికారి కామారెడ్డిలోని ప్రభుత్వ, ప్రైవేట్ బడులుకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.
🚨 Nearly 300 ST Residential School students stranded in floodwaters at Sarampalli village (Devunipalli PS limits), #Kamareddy, were safely rescued and shifted to secure shelters.
All students are safe. 👮♂️
— SP Kamareddy @sp_kamareddy@TelanganaCOPs @TelanganaDGP @TelanganaCMO… pic.twitter.com/tGvlmwYvUm— IPRDepartment (@IPRTelangana) August 27, 2025