బిచ్కుంద, జూలై 31: మంజీరా పరివాహక ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మోహన్ రెడ్డి హెచ్చరించారు. బిచ్కుంద మున్సిపల్ కేంద్రంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.