హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : సమ్మెటివ్ అసెస్మెంట్-2 పరీక్షలను ఏప్రిల్ 10 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు.
పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్ 23న పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం)ను నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి బడులకు వేసవి సెలవులు ఇస్తారు.