కామారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో (Machareddy) యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా కొరత తీర్చాలంటూ మాచారెడ్డి ఎక్స్ రోడ్డులో ధర్నా నిర్వహించారు. సరిపడా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా కోసం నెలన్నర రోజులుగా ఎదురు చూస్తుంటే సరిపడా సప్లయ్ చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు.
ఇకా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) యూరియా పంపిణీ కేంద్రం వద్ద యూరియా బస్తాలను పెంచి ఇవ్వాలని రైతులు నిరసన తెలిపారు. పంపిణీ కేంద్రం వద్ద బైఠాయించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అన్నదాతలను శాంతిపజేశారు.