కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని స్థానికులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. జార్ఖాండ్ రాష్ట్రానికి చెందిన సురుజ్ కుమార్, కరీంనగర్ చెందిన ధను, పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిషర్ నామియాలు గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డైలీ మార్కెట్లో వీరు సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతుండగా స్థానికులు పట్టుకుని చితక బాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితులపై కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.