Gambling | బిచ్కుంద (జుక్కల్), జులై 31 : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేసి తొమ్మిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జుక్కల్ మండలంలోని నాగుల్ గావ్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక బృందంతో పేకాట స్థావరాలపై దాడి చేసి పేకాట ఆడుతున్న 9 మంది పేకాటరాయుళ్లను అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు.
వారి వద్ద నుండి రూ. 10,700 నగదు, 9 సెల్ ఫోన్లు, 8 బైకులను, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్ మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలో పేకాట ఆడుతున్న, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడైనా పేకాట ఆడిన వారికి ప్రోత్సహించినా తమకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ దాడిలో బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి, పెద్ద కొడప్గల్ ఎస్సై అరుణ్ కుమార్ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
MEO Gajjela Kanakaraju | విద్యార్థులకు జీవ వైవిధ్యం పాఠ్యాంశాలు బోధించాలి : ఎంఈఓ గజ్జెల కనకరాజు
Child laborers | బాల కార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు : ఎస్ఐ మానస