kamareddy | కామారెడ్డి : స్థానిక సంస్థల్లో గెలుపే లక్షంగా పనిచేస్తున్నామని, ఆ గెలుపే పార్టీ బలన్ని నిరూపిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపెల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్స్ లో బీజేపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఆ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో పార్టీ జండా ఆవిష్కరణ చేయాలని కార్యకర్తలకు సూచించారు. అంతే కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ నాయకుడు, కార్యకర్త తప్పక పోటీ చేయాలనఇ, . ప్రతీ బీజేపీ కార్యకర్త ఇప్పటి నుండే ప్రజల్లో ఉంటూ పోటీకి సన్నద్ధం కావాలని సూచించారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని, స్థానిక సంస్థల్లో గెలుపే పార్టీ బలాన్ని నిరూపిస్తుందని అందుకే ప్రతీ ఒక్కరూ పోటీ చేసి గెలిచి ప్రజలకు మరింత పారదర్శకమైన పాలన అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ సభ్యులు వీపుల్ జైన్, నాయకులు సంద్య, వేణు, బాల్ రాజు, నేహాల్, శ్రీకాంత్, సంతోష్ రెడ్డి, చారి, భరత్, శ్రీనివాస్, నరేందర్, శ్రీధర్, సంపత్, రమేష్, ప్రవీణ్, అనిల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.