Farmers Strike | కోటగిరి : రైతులు ఆరుగాలం కష్టపడి వరి పంటను పండిస్తే సహకార సంఘంలో రైతుల పంటను తరుగు పేరిట అదనంగా వడ్లను కాంట చేస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారని రైతులు మండిపడ్డారు. మంగళవారం కోటగిరి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏముల నవీన్ మాట్లాడుతూ.. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఖరీఫ్ సీజన్లో క్వింటాలుకు కిలో తరుగు తీయగా.. ఈ రబీ సీజన్లో రైతులకు సమాచారం ఇవ్వకుండానే 40 కిలోల బస్తాకు 41 కిలోల 500 గ్రాముల నుంచి 650 గ్రాముల వరకు అధిక కాటా పెట్టడం వల్ల క్వింటాల్‌కు రెండున్నర కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే తహసీల్దార్ సమక్షంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాకల సాయిలు వెల్లుట్ల గజేందర్, ఎడ్డెడి పోశెట్టి, డాన్ రాజు, మామిడి సాయి ప్రసాద్, కాశీరాం, శ్యాం సుందర్, శ్రీనివాస్ తదితరులు వున్నారు.
Shadnagar | రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Kunal Kamra | కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట
KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం : కేటీఆర్