DGP Shivadhar reddy | నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు, ఎన్కౌంటర్లో మరణించిన రియాజ్ (Shaik Riyaz) అంత్యక్రియలు పూర్తయిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రియాజ్ మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించగా.. మంగళవారం తెల్లవారుజామున అతడి అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా నేరస్తుడు రియాజ్‌ను పట్టుకోవడంలో సహకరించిన ఆసిఫ్‌కు 50 వేల రివార్డు ఇస్తున్నామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ప్రెస్మీట్లో డీజీపీ మాట్లాడుతూ.. ఆసిఫ్ ప్రాణాలకు తెగించి రియాజ్‌ను పట్టుకున్నాడు. ఆసిఫ్ సహకారంతోనే కేసును ఛేదించగలిగాం. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది.
ప్రమోద్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతోపాటు 300 గజాల ఇంటి స్థలం ఇస్తున్నాము. ప్రమోద్ విధి నిర్వహణలో లాయల్టీగా ఉంటూ అందరితో కలిసి మెలిసి ఉండేవారు. ఈ కేసు విచారణలో ఉండగా ఇతర విషయాలు మాట్లాడటం సరైంది కాదన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మావోయిస్టులు స్వచ్చందంగా వచ్చి లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.
రెండు రోజుల్లోనే ..
ఈ నెల 17న దొంగతనం కేసులో రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసిందే. పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్‌పై రియాజ్ కత్తితో దాడిచేసి పరారయ్యాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ మరణించిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని రెండు రోజుల్లోనే పట్టుకున్నారు. అయితే అరెస్టు సమయంలో గాయపడటంతో అతడిని జీజీహెచ్ దవాఖానకు తరలించారు. ఈ క్రమంలో పోలీసు సిబ్బందిపై దాడి చేసి కస్టడీ నుంచి పారిపోయేందుకు యత్నించగా.. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ చనిపోయాడు.
Narnoor | నార్నూర్ ఉప మార్కెట్ యార్డులో వెదజల్లుతున్న దుర్వాసన
Sukumar | శిష్యుల కోసం సుకుమార్ దుబాయ్ ట్రిప్.. లెక్కల మాస్టారు మంచితనానికి టాలీవుడ్ ఫిదా!