Congress Party | కంటేశ్వర్, జనవరి 6 : బీజీపీ, ఎంఐఎంలు ఎన్నికల డ్రామాలు చేస్తున్నాయని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. సోమవారం ఎన్నికల ముసాయిదాపై సందేహాలు పరిష్కరించడానికి మున్సిపల్ కమిషనర్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రతి పార్టీ నుండి ఇద్దరు ప్రతినిధులు మించకుండా రావాల్సి ఉండగా.. ఎలాగైనా గొడవ చేయాలని ముందే ప్రణాళిక వేసుకున్న బీజీపీ, ఎంఐఎం నాయకులు తమ కార్యకర్తలతో కలిసి అధిక సంఖ్యలో రావడం జరిగిందని తెలిపారు.
ఇందులో భాగంగానే ముసాయిదా సందేహాలపై సమావేశం జరుగుతున్న సమయంలో బీజీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఐఎం నాయకులను కావాలని రెచ్చగొట్టే విధంగా ఇందూరు కార్పొరేషన్ అని మాట్లాడడం, దానికి వ్యతిరేకంగా ఎంఐఎం నాయకులు నిజామాబాద్ కార్పొరేషన్ అనడంతో సమావేశ ప్రాంగణంలో యుద్ధ వాతావరణం ఏర్పడిందని అన్నారు. బీజీపీ జిల్లా అధ్యక్షుడు బయటకు ఇందూరు అని మాట్లాడుతూనే.. తన లెటర్ ప్యాడ్ లో మాత్రం నిజామాబాద్ అని ప్రచురించుకోవడం జరిగింది.. దీన్ని ప్రజలు గమనించాలని కోరారు.
కేవలం ఎన్నికల వేళ గొడవ చేయాలని చూస్తున్న బీజేపీ నాయకులు ఇదే అదునుగా చూసి ఇందూరు అంటూ కపట నాటకాలు ఆడటం పక్కనపెట్టి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిజంగా తన మాటకు కట్టుబడి ఉంటే ముందుగా తన లెటర్ ప్యాడ్ మార్చుకొని మాట్లాడాలి అని సవాల్ విసిరారు.
హిందూ, ముస్లిం మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నం..
బీజేపీ జిల్లా అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడుతూ.. షబ్బీర్ అలీ కొడుకు ఇలియాస్ ను మేయర్ చేయాలని చూస్తున్నారు అని చెబుతూ నిజామాబాద్‌లో హిందూ, ముస్లిం మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసలు నిజామాబాద్ లో ఓటు లేని ఇలియాస్‌కు నిజామాబాద్‌లో ఏవిధంగా పోటీ చేస్తాడో, ఏ విధంగా మేయర్ అవ్వడానికి సాధ్యమవుతుందో బీజేపీ జిల్లా అధ్యక్షుడే తెలియజేయాలని అన్నారు.
ఇలా సాధ్యమవ్వదని తెలియకపోవడం దినేష్ అవివేకం అని.. ప్రస్తుత మేయర్ రిజర్వేషన్ బీసీ మహిళ ఉంది ఒకవేళ మారితే నిజామాబాద్ మేయర్ రిజర్వేషన్ ఏది వస్తుందో తెలియకముందే షబ్బీర్ అలీ కొడుకు మేయర్ అంటూ మీరు ఏ విధంగా అంటున్నారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.
NBK 111 | బాలయ్య సినిమా నుండి స్టార్ హీరోయిన్ ఔట్.. అదే కారణమా?